calender_icon.png 1 April, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రిలే నిరాహార దీక్ష

29-03-2025 06:06:32 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ మున్సిపాలిటీకి వెంటనే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం రిలే నిరాహార దీక్షను ఎన్నికల సాధన సమితి సభ్యులు ప్రారంభించారు. ఈ  సందర్భంగా ఎన్నికల సాధన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు లేకపోవడం మూలంగా అభివృద్ధి ఆశించడం మేరా జరగడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు జరిగేంత వరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని అయినప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.