14-03-2025 05:10:27 PM
ప్రారంభించిన వైరా మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్
వైరా,(విజయక్రాంతి): పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(Padma Shri Manda Krishna Madiga) రాదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ(SC Classification)కు చట్టబద్ధత కల్పించే అంతవరకు ఎలాంటి ప్రభుత్వ నియామకాలు చేపట్టవద్దని ప్రభుత్వ ఫలితాలను వెంటనే ఆపివేయాలని డిమాండ్ తో వైరా మండల కేంద్రంలో రింగ్ రోడ్డు సెంటర్ నందు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన వైరా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మల్లపాటి సీతారాములు(Vaira Municipal Corporation Former Vice Chairman Mallapati Seetharamulu) ఈ దీక్ష ను ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కోట కోటి మాదిగ, మండల ఇంచార్జ్ కలిసా రమేష్ మాదిగ, పీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎంకన్న మాదిగ, జిల్లా కార్యదర్శి కంచర్ల వెంకటేశులు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి మాగంటి బాబురావు మాదిగ, మండల ఉపాధ్యక్షులు మోదుగు రమేష్ మాదిగ, సీనియర్ నాయకులు తేలూరి పుల్లారావు మాదిగ, సీనియర్ నాయకులు అయినాల కనకరతం మాదిగ, నారపోగు లక్ష్మణరావు మాదిగ, గద్దల కమలాకర్ రావు మాదిగరి ఎక్కిరాల బాబురావు మాదిగ, మోస్ట్ సీనియర్ నాయకులు పమ్మి తిరుమలరావు మాదిగ, నల్లగట్ల బాబు మాదిగ, కన్నెగంటి పెద్ద హుస్సేన్ మాదిగ, కన్నెగంటి చిన్న విషయం మాదిగ, తదితరులు పాల్గొన్నారు.