ఎప్పుడైనా టిబెటన్ సింగింగ్ బౌల్స్ ప్లే చేసే శబ్దాలను విన్నారా? ఈ శబ్దాలు ఒత్తిడిని తగ్గించి.. విశ్రాంతిని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. టిబెటన్ సింగింగ్ బౌల్స్ సాధారణంగా రాగి, టిన్, జింక్, ఇనుము, వెండి, బంగారపు లోహాలతో తయారు చేస్తారు.
ఈ బౌల్‌పై చెక్కతో రుద్దినప్పుడు చక్కని శబ్దాలు వస్తాయి. ఈ గిన్నెలకు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ శబ్దాల ద్వారానే హీలింగ్ ఎనర్జీ విడుదల అవుతుంది. ధ్యానంలోకి వెళ్లడం ఏకాగ్రతతో కొనసాగించడం దీనివల్ల సాధ్యమవుతుంది.
నిద్రలేమితో బాధపడేవారికి సింగింగ్ బౌల్ శబ్దాలు వినడం వల్ల మెరుగైన నిద్ర పడుతుంది. సింగింగ్ బౌల్‌పై శబ్దాలు చేయడానికి పెద్దగా శిక్షణ అవసరం లేదు. గిన్నెను మేలట్‌తో (చెక్కతో చేసిన వస్తువు) సున్నితంగా రుద్దడమే.