calender_icon.png 25 November, 2024 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంబంధాలు ధ్వంసం

25-11-2024 02:15:05 AM

  1. మన పూర్వీకుల మాటలు మరిచిపోయాం 
  2. సమాజంలో స్వార్థ భావన పెరిగిపోయింది
  3. మన సంస్కృతిపై ఆంగ్లేయులు దాడి చేశారు
  4. వనవాసీ, గిరివాసీ, గ్రామవాసీ అంతా భారతీయులే
  5. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ 
  6. చరిత్ర కాపాడుకునేందుకు విదేశాల యత్నం: నిర్మలా సీతారామన్
  7. లోక్‌మంథన్‌తో దేశం అత్యున్నత స్థాయికి : గజేంద్రసింగ్ షెకావత్ 
  8. వసుధైక కుటుంబ భావనకు భారత్ ప్రేరణ: కిషన్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): సమాజం దిగజారిపోతోందని, మానవ సంబంధాలను మరిచిపోతున్నామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆర్ ఎస్‌ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తంచేశారు. అద్భుతమైన జీవనాన్ని మనకు పూర్వీకులు ఇచ్చారని, ఆధ్యాత్మిక మూలాల ఆధారంగా భౌతిక జీవనాన్ని ఎలా జీవించాలో తెలిపారన్నా రు.

మనం వాటన్నింటినీ మరిచిపోయామని చెప్పారు. అందుకే సమాజంలో సం బంధ బాంధవ్యాలు ధ్వంసమయ్యాయని, స్వార్థ భావనలు పెరిగిపోయాయని అన్నా రు. శిల్పకళా వేదికలో లోకమంథన్‌ొో౨౦౨౪ ముగింపు కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు. సృష్టి ధర్మాన్ని అర్థం చేసుకొని, అందరూ జీవనాన్ని సాగించాలని సూచించారు.

ధర్మం పేరుతో మనం చాలా అధర్మాలు చేశామని, అందుకే దుర్బలులుగా మారిపోయామని పేర్కొన్నారు. ఆనందం, సుఖం, సంతోషం కోస మే మథనం అని అన్నారు. సుఖం, సంతో షం కోసం అందరూ బయటి ప్రపంచం వైపు చూస్తారు కానీ, అది అక్కడ దొరకదని, అంతరంగంలోనే దొరుకుతుందని చెప్పారు.

అంతరంగంలో శోధించడం ప్రారంభిస్తేనే అసలైన సత్యం దొరుకుతుందని తెలిపారు. ప్రాచీన కాలం నుంచి వస్తు న్న మన ధర్మాన్ని ప్రపంచానికి పంచాలని కోరారు. వివిధ కర్మలతో మనకు మానవ జన్మ లభించిందని, వాటిని పూర్తి చేసుకోడానికి పరుగెత్తుతారని అన్నారు. ఒకానొక దశలో అలసిపోయి ఆగిపోతామని, ఆనం దం, సంతోషం లభించదని చెప్పారు.

కానీ, మన పూర్వీకులు ఆగిపోలేదని, వారు అంతరంగంలో శోధించడం ప్రారంభించారని తెలిపారు. అప్పుడు అసలైన సత్యం వారికి లభించిందని చెప్పారు. ఏక త్వ భావన వుంటే అంతా మనదే అన్న భావన వస్తుందని, అంతేకాకుండా అందరూ సుఖంగా వుంటేనే మనం కూ డా సుఖంగా వుంటామనీ అర్థమైందన్నారు. 

ఆంగ్లేయుల కారణంగా సంస్కృతి ధ్వంసం  

ఒకప్పుడు అటవీ సంపద, అడవిపై హక్కులన్నీ గిరిజనులకే వుండేవని.. కానీ, ఆంగ్లేయుల పాలనలో ఈ హక్కులన్నీ వారి చేతుల్లోకి వెళ్లా యని మోహన్ భగవత్ అన్నారు. ఆంగ్లేయులు మన సంస్కృతిని ధ్వంసం చేశారన్నారు. వారు దేనిని వదల కుండా ధ్వంసం చేశారని చెప్పా రు. కేవలం పరాయి పాలన వల్ల మాత్రమే ఇ లా జరగలేదన్నారు. మన పూర్వీకులు అద్భుతమైన జీవనాన్ని సాగించినా మనం ఆత్మ విస్మృతిలోకి దిగజారామని తెలిపారు.  

సమాజంలో మార్పునకు కృషి చేయాలి

మనం ఆత్మ విమర్శ చేసుకుంటూనే సమాజంలో మార్పునకు కృషి చేయాలని మోహన్ భగవత్ సూచించారు. సమాజాన్ని కూడా మ నం సరిచేయాలని, ఈ ధోరణులు క్షీణించడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నా యని అభిప్రాయపడ్డారు. వనవాసీ, గిరివాసీ, గ్రామవాసీ అయినా అందరం భారత వాసులమేనని ప్రకటించారు. ఇది కేవలం భావనాత్మకమే కాదని, ఇది సత్యమని వివరించారు. 

మన తత్వశాస్త్రం సైన్స్‌తో సమ్మిళితం 

భారతీయ తత్వశాస్త్రం సైన్స్ తో సమ్మిళితమై ఉందని అంటుంటారని.. కానీ, సైన్స్ భా రతీయ తత్వశాస్త్రాన్ని నమ్ముతుందా లేదా అని అడగాలని భగవత్ అన్నారు. సైన్స్ మన ఆ మోదం పొందాలని, ఆ రోజు కచ్చితంగా వ స్తుందని ధీమా వ్యక్తం చేశారు. శోధించిన తర్వా త, పరీక్షించిన తర్వాతే ఆ నమ్మకాన్ని స్వీకరిస్తామని ప్రకటించారు. కొందరు ఓటమిని అంగీక రించక వాదనలు చేస్తుంటారని విమర్శించారు. 

లోక్‌మంథన్ ఢిల్లీ, హై దరాబాద్ లాంటి మహానగరాల్లోనే కాకుండా మారుమూల ప్రాంతా ల్లోనూ ఏర్పాటు చేయాలని మోహన్ భగవత్ సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మం త్రులు నిర్మలాసీతారామన్, కిషన్‌రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, అ యోధ్యకు చెందిన ఆచార్య మిథిలేష్ నందినీ శరణ్, సంస్కార భారతి అభిజిత్ గోఖలే, లోక్‌మంథన్ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్, ప్రజ్ఞాభారతి తెలంగాణ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశవిదేశాలకు చెందిన 1200 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

సంస్కృతి పరిరక్షణకు విదేశాల తాపత్రయం : నిర్మలా సీతారామన్

విదేశాలు వారి చరిత్ర, సంస్కృతిని కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మెక్సికోలాంటి దేశాలు తమ సంస్కృతి, చరిత్రను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని గుర్తుచేశారు. అమెరికా, యూరోపియన్ దేశాలు తమ చరిత్రను తెలుసుకునేందుకు కష్టపడుతున్నాయని వివరించారు.

యూరప్‌లో రోమ కమ్యూనిటీ ప్రజలు ఎంతో పురాతనమైన తమ సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ మర్చిపోవడం లేదన్నారు. ఈజిప్టులోనూ పురాతన విధానాలను పాటించే వారున్నారని తెలిపారు.  న్యూజిల్యాండ్ పార్లమెంట్‌లో తమ సంస్కృతిని గుర్తుచేసేందుకు ఓ స్థానిక గిరిజన ఎంపీ పాడిన పాట ప్రపంచమంతా చూసిందన్నారు.  ఎంతో గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్న మనమెందుకు మన మూలాలను మర్చిపోవాలని ప్రశ్నించారు. 

దేశంలో ఆధ్యాత్మికత, అభివృద్ధి పెరుగుతుంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశంలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించుకుంటున్నామని, అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశాభివృద్ధికి అడ్డుగా ఉన్న అరాచకాలను పారదోలుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. వసుధైక కుటుంబం అనే భావన మన దేశం నుంచి ప్రపంచానికి ఓ ప్రేరణగా నిలుస్తోందన్నారు. దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ప్రపంచమంతా శాంతి కోసం మన దేశం వైపు చూస్తున్నారని అన్నారు. మన దేశం విశ్వగురుగా మారేందుకు అందరూ కృషిచేయాలని కోరారు. 

అత్యున్నత స్థాయికి దేశం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు లోక్‌మంథన్ లాంటి కార్యక్రమాలు పనిచేస్తాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు విదేశీ పోకడల వల్ల ఒడిదుడుకులు ఎదుర్కున్నా మన ఐకమత్యం వల్లే వాటిని తిరిగి పొందే అవకాశం లభిస్తోందన్నారు.

ఎంత క్లిష్టమైన పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సమాజం సన్నద్ధతతో ముందుకు కదలాలని.. అప్పుడు వాటిని పారదోలడం పెద్ద విషయం కాదని ప్రధాని మోదీ చేప్తారని అన్నారని చెప్పారు. అది లోక్‌మంథన్ ద్వారా నిరూపితమవుతుందని స్పష్టంచేశారు.