22-03-2025 12:00:00 AM
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మార్చి 21: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని అడివెంల గ్రామానికి చెందిన డాక్టర్ బోయలపల్లి రేఖ నియమితులయ్యారు.గురువారం రాత్రి హైదరాబాద్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మొగిలి సునీతారావు నుండి నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ తన నియామకానికి కృషిచేసిన జాతీయ అధ్యక్షురాలు అల్కలాంబ మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.