calender_icon.png 26 October, 2024 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బిల్లును తిరస్కరించడం ఊహించిందే

28-08-2024 01:07:59 AM

బీజేపీ నేత అమర్‌నాథ్

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): వక్ఫ్ బిల్లు-ను తెలంగాణ వక్ఫ్ బోర్డు తిరస్కరించడం  ఊహించిందేనని బీజేపీ అధికార ప్రతినిధి అమర్‌నాథ్ అన్నారు. మంగళవారం  బీజేపీ స్టేట్ ఆఫీసులో మాట్లాడారు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఎంఐఎం నేతల  కనుసన్నల్లో తెలంగాణ వక్ఫ్ బోర్డు నడుస్తోందన్నారు. దేశంలోనే మూడో అతిపెద్ద భూ యాజమాన్య సంస్థగా ఉన్న వక్ఫ్ బోర్డు అతికొద్ది ఛాందసవాద ముస్లింల చేతుల్లో ఉం డటం, వాళ్లు దాన్ని ఒక మాఫియా లాగా రన్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

తెలంగాణలో 77 వేల ఎకరాల వక్ఫ్ ల్యాం డ్ ఉంటే.. అందులో 80 శాతం ఎంఐఎం గూండాలు, ఓవైసీ బ్రదర్స్ లాంటివాళ్లు ఆక్రమించుకున్నవేనని ఆరోపించారు. ఈ 77 వేల ఎకరాల్లో గజం కూడా పేద ముస్లింలకు ఉపయోగపడే పరిస్థితిలో లేదన్నారు. ప్రభుత్వ సంస్థల విచారణ లేకుండా చేయడమంటే ఒక మాఫియాలాగా నే ఈ వక్ఫ్ బోర్డును నడపాలని కోరుకుంటున్నట్టు అర్థమవుతుందన్నారు. ఇప్పటివరకు వక్ఫ్ ట్రిబ్యునళ్ల లో ఉన్న కేసుల్లో 90 శాతం బాధితు లు ముస్లిం కుటుంబాలేనని తెలిపా రు. వక్ఫ్‌బిల్లును సామాన్య ముస్లింలకు అర్థమయ్యేలా చెప్పాలని మేధా వులను, ముస్లిం పెద్దలను కోరారు.