calender_icon.png 30 October, 2024 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీయింబర్స్‌మెంట్స్ విడుదల చేయాలి

04-07-2024 02:43:21 AM

  • ఏబీవీపీ నాయకుల డిమాండ్ 
  • విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయింపు

అదిలాబాద్(నిర్మల్), జూలై 3(విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న రూ.ఏడు వేల కోట్లకు పైగా  ఫీజు రీయింబర్స్‌మెంట్స్, స్కాలరిప్‌లను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు రోడ్డెక్కారు. నిర్మల్‌లో ఏబీవీపీ ఆధర్యంలో బుధవారం అంబేద్కర్ చౌక్ నుంచి వివేకానంద చౌక్ వరకు భారీ ర్యాలీ నిరహించి, అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.  ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ మాట్లాడుతూ రాష్ర్ట వ్యాప్తం గా దాదాపు రూ.7 వేల కోట్లకు పైగా స్కాలరిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు విడు దల చేయకపోవడం శోచనీయమన్నారు.

ప్రభుతాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్యాలు ఫీజులు కట్టాలని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా స్కాలరిప్స్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏబీవీపీ ఆధర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విభాగ్ ఎస్‌ఎఫ్‌ఎస్ కనీనర్ చంద్రగిరి శివకుమార్, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు దినేష్, సన్ని, లక్ష్మణ్, సాయి, సిద్ధూ, విగ్నేష్, రాజేందర్ పాల్గొన్నారు.