calender_icon.png 26 November, 2024 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

25-09-2024 03:20:28 AM

తెలంగాణ ప్రొఫెషనల్, డిగ్రీ కాలేజీల సంఘాల వినతి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ప్రొఫెషనల్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మాట్లాడారు.

2021 విద్యాసంవత్సరాలకు సంబంధించి రాష్ట్రంలో రూ.6,900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు పేరుకుపోవడంతో కళాశాల భవనాలకు అద్దెలు, పన్నులు, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేమని.. కాలేజీలు మూతపడే పరిస్థితిలో ఉన్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.

దసరా కంటే ముందే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ బీఎడ్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు కె.రామ్‌దాసు, తెలగాణ ఫార్మసీ కాలేజీల సంఘం అధ్యక్షుడు జయపాల్ రెడ్డి, ఇంజినీరింగ్ కాలేజీల ఫెడరేషన్ కన్వీనర్ నాగయ్య చౌదరి, జూనియర్ కాలేజీల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఇతర సంఘాల నాయకులు, తదిత రులు పాల్గొన్నారు.