calender_icon.png 1 October, 2024 | 5:58 AM

రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి

01-10-2024 01:30:48 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, సెస్టెంబర్ 30 (విజయక్రాంతి):  డిగ్రీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల పెండింగ్ రీయంబర్స్‌మెంట్ బకాయిలను సర్కార్ వెంటనే చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ఇందిరాపా ర్కు ధర్నాచౌక్‌లో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల రియింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం బకాయిలు  చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. యాజమాన్యాలు కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు సైతం ఇవ్వడం లేదని, దీంతో వారు ఉద్యోగాలు పొందలేకపోతున్నారన్నారు.

అలాగే అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీలకు అద్దె లు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సం ఘం అధ్యక్షుడు రామకృష్ణ, బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేష్ యాదవ్, నేతలు కృష్ణ, నీల వెంకటేశ్, అంజీ, సతీష్, అనంతయ్య, రాజేం దర్, ప్రభాకర్, నంద గోపాల్, హరీష్, రవి, దేవ్ మోదీ, ప్రభాకర్ పాల్గొన్నారు.