calender_icon.png 8 January, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వవేదికపై ప్రస్థానం

02-01-2025 02:09:35 AM

  1. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
  2. ప్రజలకు దగ్గరగా ఉండాలి
  3. ఎవరు పనిచేస్తున్నారో నా వద్ద సమాచారం ఉంది
  4. స్థ్దానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  పనిచేయాలి
  5. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం సూచనలు

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తన పర్సనల్ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ నుంచి బుధవారం ఆయన కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

‘నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం.. ప్రస్థానం ఉండాలని.. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని.. మనసారా కోరుకుంటూ...అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. 

నూతన సంవత్సర వేళ సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశా నిర్ధేశం చేశారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం ఆగ్రహం వక్తం చేశారు. బుధవారం తన నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. ఎవరు ప్రజలకు దగ్గర ఉన్నారో, దూరంగా ఉంటున్నారో తన వద్ద నివేదికలు ఉన్నాయని..

తాను మారానని, మీరంతా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.  నియోజకవ ర్గంలో గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టి కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని, కార్యకర్తలకు తగిన సమ యం కేటాయించి వారి సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్‌లోకి పెద్ద సంఖ్యలో వలసలు ఉన్నా యని, స్థానిక పంచాయతీ ఎన్నికలే టార్గెట్‌గా పనిచేయాలన్నారు.

అంద రు సమన్వయంతో ఎన్నికల లక్ష్యంగా ముందుకు వెళ్లాలని, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరులో సత్తా చాటి, తమ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం చేయాలని సూచించారు. కొంద రు ఎమ్మెల్యేలు అతి ఉత్సహం చూపిస్తున్నారని, అతి చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు దీటుగా కౌంటర్ ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు.