calender_icon.png 30 October, 2024 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిత్యం రెండు స్కూళ్లను సందర్శించాలి

30-10-2024 02:25:42 AM

  1. ఉత్తమ ఎంఈవోలకు అవార్డులు
  2. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ప్రతి మండల విద్యాధికారి (ఎంఈవో) రోజూ కనీసం రెండు పాఠశాలల చొప్పున సందర్శించాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సూచిం చారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎంఈ వో పాత్ర కీలకమని చెప్పారు.

రాష్ట్రంలోని 624 మండలాలకు చెందిన ఎంఈవోలకు ఒక రోజు శిక్షణ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుర్రా వెంకటేశం హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి స్కౌట్స్, గైడ్స్ లేదా జూనియర్ రెడ్ క్రాస్‌లో చేరేలా ప్రోత్సహించాలని కోరారు.

ప్రతి పాఠశాలలో ౫ నుంచి ౬ స్టూడెంట్ క్లబ్‌లను ఏర్పాటుచేసి విద్యార్థులు వివిధ అంశా లపై చర్చించుకునేలా, స్టేజీ ఫియర్ పోయేందుకు వేదికపై మాట్లాడేలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని చెప్పా రు. మండల స్థాయిలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులను పాఠశాలలకు ఆహ్వానించి, వారిచే విద్యార్థులకు ఆయా రంగాల పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు.

చదువులో వెనుకబడిన విద్యార్థులను ఆ యా రంగాల్లో రాణించేలా అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో పాఠశాల విద్యాభివృద్ధిలో కృషి చేసిన ఎంఈవోలకు రాష్ట్రస్థాయిలో అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇవీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. విద్యాశాఖకు ఎంఈవోలు కళ్లు, చెవుల్లాంటి వారని పేర్కొన్నారు.

విద్యాశాఖ చేపట్టే ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ వంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచాలని సూచించారు. డిసెంబర్ 4న నిర్వహించే నాస్‌లో ఫలితాలు రాబట్టాలని తెలిపారు. విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచడానికి తల్లిదండ్రులు, టీచర్లు తమ వంతు కృషి చేయాలని అన్నారు.

బడి బయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, ఉషారాణి, ఏఎస్‌పీడీ రాజీవ్, జాయింట్ డైరెక్టర్లు మదన్‌మోహన్, వెంకట నర్సమ్మ, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.