రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 1993 నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న 47 మంది సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమబద్ధీకరణ కేవలం పెన్షన్, పెన్షన్ ప్రయోజనా లకేనని తెలిపింది.
ఉమ్మడి రాష్ట్రంలో బేవరేజెస్ కార్పొరేషన్లో సెక్యూరిటీ గార్డులు, అటెండరు, స్వీపరు ఉద్యోగులు 595 మందికిగాను 200 మందిని 1994లో క్రమబద్ధీ కరిస్తూ జీవో 212 జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ పదేళ్లకు పైగా సర్వీసు అందించినా క్రమబద్ధీక రించకపోవడాన్ని సవాల్ చేస్తూ కార్మికులు 90 మందికిపైగా 2018లో పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై జే అనిల్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. గత 30 ఏళ్లుగా కార్పొరేషన్లో వివిధ రకాల పనులు చేస్తున్నా, క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభుత్వం తీసుకువచ్చిన విధాన నిర్ణయాలను కార్పొరేషన్ అమలు చేయడంలేదని తెలిపారు.
వాదనలు విన్న ధర్మాసనం 30 ఏళ్లుగా కార్పొరేషన్‌కు సేవలందిస్తున్న కార్మికులను క్రమబద్ధీకరిం చాల్సిన అవసరం ఉందని తెలిపింది. 1993 నవంబరు నాటికి 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 47 మందికి సర్వీసును పెన్షన్, పెన్షన్ ప్రయోజనాల నిమిత్తం క్రమబద్ధీకరించాలని ఆదేశించింది.
పదవీ విరమణ చేసినవారు పిటిషనర్లు 4 వారాల్లో వినతి పత్రాలను సమర్పించాలని, వీటిపై తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వాన్ని, కార్పొరేషన్‌ను ఆదేశించింది. పిటిషన్ విచారణలో ఉండగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పెన్షన్ ప్రయోజనాలను అందజేయాలని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను మూసివేసింది.