calender_icon.png 2 January, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయండి

31-12-2024 02:06:42 AM

ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట యూనివర్సిటీస్ కాంట్రాక్టు అధ్యాపకుల ధర్నా

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఏండ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీస్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జేఏసీ నాయులు డిమాండ్ చేశారు.

ఈ మేరకు మాసబ్‌ట్యాంక్ వద్ద గల ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట జేఏసీ రాష్ట్ర నాయకులు విజేందర్‌రెడ్డి, ఉపేందర్, ధర్మతేజ, వేల్పుల కుమార్, సాదు రాజేశ్ తదితరుల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొ.ఇటిక్యాల పురుషోత్తం, ప్రొ.మ  సెక్రటరీ ప్రొ.శ్రీరాం వెంకటేశ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులు వినలేదు.

ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణారెడ్డి లిఖిత పూర్వక హామీ ఇచ్చేవరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. 15 ఏండ్లుగా వివిధ యూనివర్సిటీల్లో చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను రెగ్యులరైజ్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సాను  ఉన్నప్పటికీ అధికారులు సానుకూలంగా రిపోర్టు పంపడంలేదని ఆరోపించారు.

తమను కాదని యూనివర్సిటీల్లో కొత్తగా అధ్యాపక పోస్టులు భర్తీచేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. కార్యక్ర  కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ నాయకులు డా.మాదాసి కనకయ్య, డా. సతీష్, డా. సీహెచ్ నాగేశ్వరరావు, డా.సత్యజూల, డా.రాజేశ్వరి, డా.శ్రీదేవి, డా.వెంకటేశ్, డా.గోపి, డా.స్వామి, డా.సునీత, డా.విజయ్, డా.సిద్దార్ద్థ తదితరులు పాల్గొన్నారు.