calender_icon.png 23 December, 2024 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలి..

23-12-2024 04:48:25 PM

కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు ఏ.ఎన్.ఎం ల నిరసన..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఏ.ఎన్.ఎం లకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సీఐటీయూ అనుబంధ వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అన్నమొల్ల కిరణ్  మాట్లాడుతూ.. ఏ.ఎన్.ఎం లను రెగ్యులర్ చేయాలనీ గతంలో సమ్మె చేపట్టామన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ముగ్గురు సభ్యలతో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.

ఆ కమిటీ ప్రభుత్వంకు నివేదిక ఇవ్వకముందే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రాత పరీక్ష పెట్టటం సరికాదన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న డాక్టర్ లకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ చేశారో, అదే పద్ధతిలో కాంట్రాక్టు ఏ.ఎన్.ఎం లను సైతం రెగ్యులర్ చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కన్వీనర్ నవీన్ కుమార్, ఏ.ఎన్.ఎం లు పుష్పల, ఆనంద బాయి, తులసి, మమత, ప్రియదర్శిని, అహల్య, జ్యోతి, అన్నపూర్ణ, కరుణ, రుక్మిణి, పుష్పలత, రామ తదితరులు ఉన్నారు.