calender_icon.png 25 October, 2024 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలి

15-07-2024 12:22:49 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలకు తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్‌రావు, సామాజిక వేత్త అరుణ్‌కుమార్ అన్నారు. ఆదివారం నగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వంగూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రెగ్యులర్ వీసీలు లేకపోవడం వల్ల సమస్యలు పేరుకుపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నీట్ పేపర్ లీకైందని విమర్శించారు. కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదం తిరుపతి, నాయకులు ఉదయ్‌కుమార్, చంద్రశేఖర్, మాలోత్ రాజేశ్ నాయక్, సంద గణేశ్, మధు, రంగస్వామి, శ్రీలత, సునీల్ చారి, సందీప్, రవి, హరీష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.