calender_icon.png 22 December, 2024 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నదిపై పోలీస్ అవుట్ పోస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

16-09-2024 03:02:53 PM

పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ప్రారంభోత్సవం లో సీపీ శ్రీనివాస్

పెద్దపల్లి,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గోదావరి బ్రిడ్జ్ వద్ద ఇటీవల నిర్మించిన పోలీస్ అవుట్ పోస్ట్ కంట్రోల్ రూమ్ ను సోమవారం సీపీ శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ చేతన ఇతర పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఆవుట్ పోస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు పోలీసు పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు తో పాటు ఇరువైపులా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు.

వీటి ద్వారా పోలీస్ కంట్రోలింగ్ సిస్టం కొనసాగిస్తామని, తద్వారా బ్రిడ్జిపై ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్న వాటిని క్లియర్ చేసేందుకు రివర్ గార్డ్ పోలీసులు సిద్ధంగా ఉంటారన్నారు. నది వద్ద ఎలాంటి ప్రమాదాలు జరిగినా క్షణాల్లో కాపాడేందుకు అన్ని రకాల పరికరాలతో పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంటారన్నారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏ ఆర్ ఏసీపీ సురేంద్ర, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, ఆర్ఐ లు దామోదర్, వామన మూర్తి, సంపత్, తదితరులు పాల్గొన్నారు.