calender_icon.png 6 February, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్.. వ్యక్తి అరెస్టు

06-02-2025 12:09:09 AM

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 5: ఫోర్జరీ సంతకాలతో ఓ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిపై పోలీసులు రిమాండ్ కు తరలిం చారు. మైలార్ దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ కేసు వివరాలు వెల్లడించారు. బాధితుడు పవన్ గౌడ్ అనే వ్యక్తి కుక్కమల్ల ప్రకాషం కుమారుడు, కూతురు నుంచి కాటేదాన్ లోని ప్లాట్ నెం 517 లోని 300 గజాల స్థలాన్ని జీపిఏ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.

సదరు ప్లాట్ ను సుభాష్, అశోక్ అగర్వాల్, సంజు దేవి కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో ఆక్రమించుకొని అందులో బిల్డింగ్ కట్టి ఉంటున్నారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఇన్స్పెక్టర్ నరేందర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సదరు ప్లాట్ ను కుక్కమల్ల ప్రకాషం కు 1974 లో టీఎన్జీవో సొసైటీ ద్వారా అలాట్ అవగా అప్పట్లో ఖాళీ ప్లాటుగా ఉండేది.

ప్రకాషం 1999 లో చనిపోగా ఆ విషయం తెలుసుకున్న కాటే దాన్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొప్పుల అమరేశ్వర్ గౌడ్ ప్లాట్ ను అక్రమిం చుకోవాలనే దురుద్దేశంతో  2011లో ఆయన తనకు తెలిసిన సుభాష్ శ్రీనివాస్, సయ్యద్ రషీద్ ఖాన్, నర్సిహ్మ రెడ్డి తో కుమ్మకై ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫొటోను పెట్టి,

అమరేశ్వర్ గౌడ్ ఫోర్జరీ సంతకం చేసి సుభాష్ అనే వ్యక్తి పేరు మీద జిపిఏ చేసి ఆ తరువాత ఆ ప్లాట్ ను అశోక్ అగర్వాల్ అనే వ్యక్తికి విక్రయించినట్లు విచారణలో తేలింది. 28-01-2025 న శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బుధవారం కొప్పుల అమరేశ్వర్ ను అరెస్టు చేసి రిమైండ్ కు పంపారు.