calender_icon.png 19 November, 2024 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు

19-11-2024 04:53:41 PM

నర్సాపూర్ (విజయక్రాంతి): ఆరేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో జరిగింది. రెండు నెలల క్రితం ఓ భూవివాదంలో వచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో విట్టల్ అనే వ్యక్తి గత ఆరేళ్ల క్రితమే మృతి చెందాడు. ఈ క్రమంలో పోలీసులు విట్టల్ ఇంటికి వెళ్ళగా కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. కనీస విచారణ చేయకుండా చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ పోలీసులు చేసిన నిర్వాహకం పట్ల ప్రజలు విస్తుపోయారు.