01-03-2025 12:42:18 AM
ఎల్లారెడ్డి 28 ఫిబ్రవరి (విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని అడవి లింగాల గ్రామంలో నిజమైన భవన నిర్మాణ రంగ కార్మికుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం నాడు నిజమైన నూతన భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘం ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు మర్ల సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో భవన నిర్మాణరంగా సంఘం కార్మికులుగా అర్హత లేని కొంతమంది సభ్యత్వం తీసుకొని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం అందించే కొన్ని రకాల సంక్షేమ ఫలాలను అందుకోవడానికి కొంతమంది కార్మికేతరులు (కార్మికులుగా పని చేయని వారు) ఆన్లైన్ ద్వారా లేబర్ కార్డులు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి వారి ఆగడాలను అరికట్టడానికకి వాస్తవంగా పనిచేసే నిజమైన భవన నిర్మాణ రంగ కార్మికుల సంఘాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.పనిచేసే శ్రామికులకే సభ్యత్వం, లేబర్ కార్డు అందించడానికి కృషి చేస్తామన్నారు.ఆన్లైన్ ద్వారా లేబర్ కార్డుకు దరఖాస్తు చేసుకొనే అర్హత లేని వారిని గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
బోకస్ కార్మికులకు లేబర్ కార్డులు ఇప్పించే మధ్యవర్తులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అడవి లింగాల గ్రామ నిజమైన భవన నిర్మాణరంగా కార్మికులు వడ్డే రాజేందర్,పందిటి సాయిలు, రవీందర్, సంగమేశ్వర్,పోచయ్య, ప్రకాష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.