తెలంగాణ రాష్ట్ర దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్
వనపర్తి,(విజయక్రాంతి): మున్సిపాలిటీ మరియు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పాత ఇండ్లు, స్థలాల రిజిస్ట్రేషన్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్, రాష్ట్ర ప్రభుత్వంని కోరారు. సోమవారం తన కార్యాలయంలో డాకుమెంట్స్ రైటర్స్ తో కలిసి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇండ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ నిమిత్తం జారీ చేసిన జీవోల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని జీవోలను ఎత్తేస్తామని ఎలాంటి ఎల్ఆర్ఎస్ లు బిఆర్ఎస్ లు ఉండవని ప్రకటించి అధికారంలోకి వచ్చింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను సవరించి ప్రజలు ఇబ్బందులను గుర్తించి రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరిష్కరించాలన్నారు. ఈ జీవోల వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడో తాతల కాలంలో కట్టిన ఇండ్లు ఇప్పుడు అన్నదమ్ముల భాగ పరిష్కారం చేసుకుంటే రిజిస్ట్రేషన్ కు రావాలంటే దానికి ఎలాంటి పాత లింకు డాక్యుమెంట్ కానీ ఇంటి పర్మిషన్ కానీ ఉండదన్నారు. ఇప్పుడు ఉన్న ఈ జీవోల ప్రకారం కచ్చితంగా లింకు డాక్యుమెంటు లేదా ఇంటి పర్మిషన్ ప్రజలు సమర్పించాల్సి వస్తుంది.
అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్న వారి వారి ఇండ్లను వాళ్ళు స్వాధీన పరచుకున్న అటువంటి ఆస్తులు రిజిస్ట్రేషన్ జరగడం లేదని అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఇంటి నెంబరు గ్రామపంచాయతీలో అసెస్మెంట్ ఉంటుంది. కాబట్టి అంతస్థలాన్ని మాత్రమే గ్రామ కార్యదర్శిలు ద్రువీకరిస్తున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కు సంబందించి కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు రూపొందించాయి. సర్క్యులర్ 256 or 257. దీని ప్రకారం పార్ట్, నాన్ లే అవుట్ చెయ్యొద్దు. అదే విధంగా ఇంటి రిజిస్ట్రేషన్ కు 1. అనుమతి పత్రం 2. బ్లూ ప్రింట్, 3. యాజమాన్య పత్రాలు జత చేయాలనే నిబంధన పెట్టడం జరిగిందన్నారు.