calender_icon.png 18 April, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్‌కో రేటు!

11-04-2025 12:00:00 AM

  1. ఈసీ, సీసీ కావాలంటే అదనంగా చెల్లించాల్సిందే
  2. గంపగుత్తగా మాట్లాడుతున్న డాక్యుమెంట్ రైటర్లు 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 10 (విజయ క్రాంతి) : మీ ఇల్లు.. మీ ప్లాటు.. ఏవైనా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే నిబంధనల మేరకు డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని సంప్రదిస్తే మీరు మళ్ళీ తిరిగి మీ ఇంటికి వెళ్లి పోవాల్సిందే... అసలే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆపై ఖర్చు లు ఎక్కువ.. గింతే అవుతుందని గీత గీసుకొని పోతే ఎట్లా... జర సారోల ఖర్చులు కూడా ఉంటాయి...? అన్ని కలిపి తీసుకొనిపోతే మీ పని చక చకా అవుతుంది..టకటక ఇంటికి చేరుకునే అవకాశాలుంటాయి.. లేదంటే మీరు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిందే.

మన పాలమూరు లోని సబ్ రిజిస్టర్ కార్యాలయం తీరు గిట్లే ఉందంటున్నారు. ప్రతి దానికి ఒక రేటు ఉంటుందని ఆ రేటుకు తగ్గట్టు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది జర చూసుకొని పోండి.. అంటుండ్రు రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చిన కొంతమంది వ్యక్తులు.  ఇ ఇదెక్కటి విధానం అంటే గిట్లనే ఉంటది అన్ని కలిపి గింత ఇవ్వాలి... ఆస్తులు రిజిస్ట్రేషన్ అంటే ఊకెన అయితాయా..?  అనే వాదనలు వస్తున్నాయి..

చేసేదేమీ లేక వివిధ రిజిస్ట్రేషన్లకు వెళ్లిన లబ్ధిదారులు డాక్యుమెంట్ ఖర్చు తో పాటు అన్ని ఖర్చులు కలిపి అదనంగా డాక్యుమెంట్ ఫీజును వసూలు చేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా అదనంగా వసూలు చేస్తున్న అడ్డుకునే వారే కరువయ్యారు. ఉన్నత అధికారులు అందరూ జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వైపు మాత్రం చూడడం లేదనే అరుణ్ పనులు ఉన్నాయి.

అసలు రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి..? డబ్బులు అదనంగా ఎంత వసూలు చేస్తున్నారు..? ఇలా ఒక్కొక్క కోణం ఒక్కోలా సబ్ రిజిస్టర్ కార్యాలయం తీరు ఉందని పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. 

- ఎమ్మెల్యేకు ఇటీవల సబ్ రిజిస్టర్ పై ఫిర్యాదు చేసిన డాక్యుమెంట్ రైటర్లు..

రిజిస్ట్రేషన్ చేయడంలో తీవ్రంగా జాప్యం చేస్తున్నారని దీంతో పాటు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహబూబ్ నగర్ రిజిస్టర్ తీరు సరిగా లేదని డాక్యుమెంట్ రైటర్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సర్దిచెప్పి పంపించడంతోపాటు అవసరమైన చర్యలు తీసుకుంటామని డాక్యుమెంట్ రైటర్లకు హామీ ఇచ్చారు.

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిబంధనలు ఎక్కడ ఉన్నాయి? అవి లభిస్తాయి ఇక్కడ అనే తీరుగా మహబూబ్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం తీరు ఉందని రిజిస్ట్రేషన్ కి వచ్చిన పలువురు వ్యక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

-ప్రతి దానికి ఒక రేటు...

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సాధారణ రిజిస్ట్రేషన్లకు సైతం అదనంగా ఇవ్వాల్సిందే అంటూ డాక్యుమెంట్ రైటర్లు అధికారుల పేర్లు చెప్పి అన్ని కలిపి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎవరు రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ డాక్యుమెంట్ ను బట్టి అదనపు వసూళ్లకు తెర లేపుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

ఈసీ తీసుకోవా లంటే సాధారణంగా ప్రభుత్వానికి రూ 520 ఉండగా అదనంగా మరో 100, 200,300 వరకు వసూలు చేయడం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. సిసి కావాలంటే రూ 550 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకు కూడా అదనంగా వ్యక్తిని బట్టి అదనపు వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

పురాతనది సిసి కావాలంటే ఇక అంతే సంగతులు... అక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకొని తెచ్చుకోవాల్సిందేనని పలువురు అంటుండ్రు. ఫ్రాంకింగ్ చేయాలన్న మరి ఇతర పనులు చేయాలన్న అదనంగా డబ్బులు చెల్లించనిది...ఇక్కడ పనులు కావని ఆరోపణలు రోజురోజుకు ఊపందుకుంటున్నాయి. 

అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు

ప్రజలు ఎవరు కూడా డాక్యుమెంట్ రైటర్లకు అజనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ చేసినందుకుగాను కొంత డబ్బు వాళ్ళు తీసుకోవడం సహ జం. కాగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి అదనంగా ఎక్కువ డబ్బులు తీసుకోవడం అనేది సరికాదు.

ఎవరికి కూడా అదనంగా ఇవ్వకూడదు.. ఒకవేళ ఎవరైనా అడిగితే తమ దృష్టికి నేరుగా తీసు కు రావచ్చు. అదనంగా డబ్బులు వసూ లు చేయడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేరుగా నా దృష్టికి తీసుకువస్తే నిబంధనలను అతిక్రమించి వసూలు చేస్తే వారి పై చర్యలు తీసుకుంటాం. 

మహమ్మద్‌హమీద్, సబ్ రిజిస్టర్, మహబూబ్ నగర్