calender_icon.png 31 October, 2024 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ చేసే హక్కు రిజిస్ట్రార్‌కు లేదు

31-10-2024 01:58:27 AM

  1. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి
  2. మంచిర్యాల కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసే హక్కు సబ్ రిజిస్ట్రార్‌కు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని మంచిర్యాల కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి సర్వే నంబర్ 5/33లోని 8 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించి ఎలాం టి రిజిస్ట్రేషన్లను అనుమతించరాదని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర ఉత్త ర్వులు జారీచేసింది. తమ పూర్వీకులకు కేటాయించిన అసైన్డ్ భూములను ప్రైవేటు వ్యక్తుల కు రిజిస్ట్రేషన్ చేయడాన్ని సవాలు చేస్తూ ఎస్ పద్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టా రు. ప్రస్తుతం ఈ భూమి ధరణి పోర్టర్‌లో నిషేధిత జాబితాలో ఉందని పిటిషనర్ తరఫు న్యా యవాది తెలిపారు. 2013నాటి తహసీల్దార్ ఉత్తర్వులకు విరుద్ధంగా సబ్‌రిజిస్ట్రార్ ఈ భూ మిపై విక్రయ దస్తావేజులను ఎలా అనుమతిస్తున్నారని అన్నారు.

వాదనలను విన్న న్యాయ మూర్తి అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసే హక్కు సబ్‌రిజిస్ట్రార్‌కు లేదన్నారు.  విచారణను నవంబరు 22కు వాయిదా వేశారు.