calender_icon.png 26 November, 2024 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్టర్లు మాయం!

26-11-2024 01:20:09 AM

  1. ‘కాళేశ్వరం’పై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ 
  2. బ్యారేజీల వద్ద పనిచేసిన 18 మంది ఇంజినీర్లకు ప్రశ్నలు 
  3. పొంతన లేని సమాధానాలు వద్దని కమిషన్ ఆగ్రహం 
  4. మేడిగడ్డలో 7వ బ్లాక్ ఎందుకు కూలిందని సూటి ప్రశ్న
  5. 2020లోనే ఉన్నతాధికారులకు లేఖ రాశామన్న ఇంజినీర్లు 
  6. నేడు మరో ౧౫ మంది ఇంజినీర్ల విచారణ

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాం తి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమై న క్వాలిటీ కంట్రోట్ రిజిస్టర్లు మాయమైనట్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గుర్తించింది. కాళేశ్వ రం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలు, అవకతవ కలపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ మరో దఫా విచారణను సోమవారం చేపట్టింది.

ఇందులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మా ణాన్ని క్షేత్ర స్థాయిలో ఉంటూ పరిశీలించిన ఇంజినీర్లను  విచారించింది. ఇందులో మొత్తం 18 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (డీఈఈ)లను ప్రశ్నించింది. మొత్తం 52 మం ది ఇంజినీర్లకు ఇప్పటికే నోటీసులు జారీచే యగా సోమవారం 18 మంది విచారణకు హాజరయ్యారు.

ఈ సందర్భంగానే క్షేత్రస్థాయి లో ఉంటూ నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఇంజినీర్ల వద్ద ఉన్న రికార్డులు, రిజిస్టర్లపై వారి సంతకాలు తీసుకుని పరిశీలిస్తున్న సమయంలోనే నిర్మాణ సమయంలో సిద్ధంచేసిన క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయమైనట్టు కమిషన్ గుర్తించింది.

పొంతనలేని సమాధానాలు చెప్పొద్దు  

కమిషణ్ ముందు విచారణకు హాజరైన సందర్భంగా పలువురు ఇంజినీర్లు చెప్పిన సమాధానాలతో ఆగ్రహానికి గురైన కమిషన్ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండని, పొంతన లేని సమాధానాలు చెప్పొద్దని మదంలించింది. ముందుగా అనుకుని వచ్చిన సమాధానాలు వద్దంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన పనులపై ప్లేస్‌మెంట్ రికార్డులను ఎప్పటికప్పుడు సిద్ధం చేశారా.. లేక ఒక రోజు అయిన పనిని ఇంకో రోజు నమోదు చేశారా? అని కమిషన్ ప్రశ్నించింది. అతి ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీలోని కుంగిన ఏడో బ్లాక్‌పై విచారణ సందర్భంగా అక్కడ పనిచేసిన డీఈఈ భీమరాజును కమిషన్ విచారించింది.

ఏడో బ్లాక్ ఎందుకు కుంగింది? పియర్స్‌ను ఎలా నిర్మించారు? అసలు ఏడో బ్లాక్‌లో సమస్యను ఎప్పుడు గుర్తించారు? అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా డీఈఈ భీమరాజు సమాధానం చెప్తూ.. ఏడో బ్లాక్‌లో సమస్యను 2020లోనే గుర్తించి, ఉన్నతాధికారులకు సమస్యను వివరించామని చెప్పుకొచ్చారు.

అలాగే మరోసారి కూడా ఈ సమస్యపై ఉన్నతాధికారులకు లేఖ రాశామని ఆయన వివరించారు. సీకెంట్ ఫైల్స్ విధానంలో నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా మేడిగడ్డ నిర్మాణ సమయంలో నమోదు చేసిన రికార్డులను కమిషన్ పరిశీలించింది. వాటిని వారే నమోదు చేశారా లేదా అని ఆరా తీశారు. ఆయా రికార్డులు, రిజిస్టర్లపై ఇంజినీర్ల సంతకాలు తీసుకున్నారు.

మొత్తం 52 మందిలో సోమవారం 18 మందిని విచారించగా, మరో 15 మంది ఇంజినీర్లను మంగళవారం విచారించనున్నది. మొత్తం 52 మంది ఇంజినీర్ల విచారణ పూర్తయిన తరువాత.. కీలకమైన వ్యక్తుల విచారణకు సంబంధించిన నిర్ణయాలను కమిషన్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం.