13-03-2025 01:20:56 AM
ఆప్తాల్మిక్ ఆఫీసర్ గంగవరం రామ్‌రెడ్డి
ఖానాపూర్, మార్చి 12 ః నిర్మల్ జిల్లా, ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో, ఈనెల 26వ తేదీ నాడు, ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం ప్రారంభిస్తున్నామని ,కంటి ఆపరేషన్లు చేయించుకునేవారు పేర్లు నమోదు చేసుకోవాలని, ఆప్సాల్మిక్ ఆఫీసర్ గంగవరం రామ్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
జిల్లా అందత్వ నివారణ సంస్థ ,విజన్ సెంటర్‌లో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, ఆపరేషన్ చేయించుకునేవారు ముందుగా, తమ పేరును ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదు చేసుకోవాలని, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, తీసుకొని రావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 99857 37466 నంబర్లకు సంప్రదించాలని కోరారు.