calender_icon.png 14 February, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం కావాలి

14-02-2025 12:18:07 AM

  1. డీపీఆర్, డిజైన్ల పనులకు నిధుల కొరత లేదు
  2. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రహదారుల నిర్మాణం  
  3. జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ ఇవ్వాలి 
  4. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పను లను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖ ప్రీ బడ్జెట్ సమావేశంలో పలు అంశాలు చర్చించారు. రీజినల్ రింగ్ రోడ్డు డీపీఆర్, త్రీడీ డిజైన్లు వంటి పనులు వేగవంతం చేయాలని, ఇందుకు నిధుల కొరత లేదని తెలిపారు.

రాష్ర్టవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. పెద్దసంఖ్యలో ఉన్న విలువైన ఈ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా అధికారులు అన్ని స్థా యిల్లో చర్యలు చేపట్టాలన్నారు. హ్యామ్ (హైబ్రిడ్ యాన్యూటీ హెడ్) రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. జి ల్లా కేంద్రాల నుంచి రాష్ర్ట రాజధానికి వచ్చే రహదారులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టి నిధులు సద్వినియో గం చేయాలని ఆదేశించారు. కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని డిఫ్యూటీ సీఎం వెల్లడించారు.

సమావేశంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్, ఆర్‌అండ్‌బీ కార్యదర్శి దాసరి హరిచందన, ఆర్థిక శాఖ కార్యదర్శి హరిత తదితరులు పాల్గొన్నారు.

గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టాలి.. 

అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షే మ హాస్టళ్లు, గురుకులాల అద్దె బకాయిలను చెల్లిస్తామని, ప్రతిపాదనలు తీసుకు రావాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమర్క సూచించారు. గురుకులాల్లో ఒకేషనల్ కో ర్సులు ప్రవేశపెట్టాలన్నారు.  గురువారం సచివాలయంలో ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించారు.

బీసీ స్టడీ సెంటర్లు ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉండాలని ఆదేశించా రు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలన్నారు. డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షలపై  దృష్టి సారించాలన్నారు.

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, వాటి నిర్వహణకు అవసరమై న చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఆస్తుల నిర్వహణ, ఆదాయ వనరులపై చర్చించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.