calender_icon.png 22 January, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘విడాముయర్చి’ నుంచి రెజీనా లుక్

13-08-2024 12:00:00 AM

అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్ కథానాయకుడిగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో ‘విడాముయర్చి’ చిత్రాన్ని సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్ త్రిష, యాక్షన్ కింగ్ అర్జున్  ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆరవ్, నిఖిల్‌తోపాటు రెజీనా కసాండ్ర కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోమవారం రెజీనా కసాండ్ర లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. అజిత్ సినిమాలో రెజీనా నటించటం ఇదే తొలిసారి.