calender_icon.png 31 March, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ భవన నిర్మాణం ఆపకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చిన అదృశ్య శక్తి బయటికి రావాలి

28-03-2025 01:12:46 PM

బాధితులకు కోటి రూపాయలు,  ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి 

జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో ఇటీవల కూలిపోయిన అక్రమ భవన నిర్మాణానికి సహకరించిన అదృశ్య శక్తి బయటికి రావాలని దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి బధితులకు న్యాయం చేయాలని బిఆర్ఎస్ పార్టీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాచలం ఆసుపత్రిలో ఉపేందర్ రావు భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ భవనాలు నిర్మిస్తుంటే అధికారులు చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని, భద్రాచలం జరిగిన సంఘటనపై కూడా ఇదే జరిగిందని అన్నారు.

పంచాయతీ అధికారులు అనేకసార్లు భవన నిర్మాణం ఆపాలని ఇంటి యజమాని కి నోటీసులు ఇవ్వడమే కాకుండా ఉన్నతాధికారులు కూడా తెలియజేసినప్పటికీ ఏ అధికారి కూడా స్పందించి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఉన్నతాధికారులు స్పందించకపోవటానికి వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని ఇప్పటికైనా ముఖ్యమంత్రి సమగ్ర విచారణ చేసి ఆ అదృష్టశక్తులను బయటికి రప్పించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. చనిపోయిన రెండు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ , నరసింహారావు, మండల నాయకులు సునీల్, పూర్ణ చందర్రావు తో పాటు పలువురు పాల్గొన్నారు.