వ్యక్తిగత హోదాలో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్
ప్రజాతీర్పును ప్రభుత్వం కాలరాసిందన్న పాల్
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): ఒక పార్టీ తరఫున గెలిచి మరోపార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సభ్యత్వాలను రద్దు చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యక్తిగత హోదా లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని విచారణ చేపట్టబోమని హైకోర్టు ప్రకటించింది. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలు పొందిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా ఈసీకి ఉత్తర్వులు ఇవ్వాలనే పిటిష న్లు హైకోర్టు విచారణలో ఉన్నాయని చెప్పింది.
వాటిపై విచారణ పూర్తి చేసిన సింగిల్ జడ్జి గత నెల 7న తీర్పును వాయిదా వేశారని గుర్తు చేసింది. ఈ వ్యవహారం సింగిల్ జడ్జి వద్ద ఉండగా తాము అదే అంశంపై పిల్‌పై విచారణ చేయలేమని వెల్లడించింది. సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లపై నిర్ణయం వెలువడ్డాక పిటిషనర్ అవసరమైతే తమ వద్దకు రావచ్చునని చెప్పింది. ఫిరాయించిన వారిపై రాజ్యాంగంలోని పదో షెడ్యూలు, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద అనర్హత వేటు వేసేలా ఈసీకి ఉత్తర్వులు ఇవ్వాలంటూ పాల్ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
వ్యక్తిగతంగా కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ ఒక పార్టీ నుంచి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో పది మంది కాంగ్రెస్‌లో చేరడం ద్వారా ప్రజా తీర్పును కాలరాశారని చెప్పారు. మరో ముగ్గురు కూడా పార్టీ మారబోతున్నారని అధికార పార్టీ చెప్పిందన్నారు. ఎన్నుకున్న ప్రజలకు కనీస జవాబుదారీగా లేకుండా పార్టీలు మారుతుంటే ఉపేక్షించకూడదని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఈసీకి ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
పారీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు జీతాలు, భత్యాలు, ఇతర సౌకర్యా లను నిలిపివేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, ఇదే వ్యవ హారంపై సింగిల్ జడ్జి వెలువరించే ఉత్తర్వులతో సంతృప్తి చెందని పక్షంలో తమ వద్దకు రావచ్చని పిటిషనరకు చెప్పింది.