calender_icon.png 15 November, 2024 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెయిల్ తిరస్కరణ

15-11-2024 12:00:00 AM

నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన మధురై బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పును వెలువరించింది. కస్తూరి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది. తమిళనాడుకు తెలుగు వారు వలస వచ్చిన వారు కాదని..

రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వామిగా ఉన్న వారని బెంచ్ స్పష్టం చేసింది. కస్తూరి వ్యాఖ్యలపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు వారిని, తమిళులను వేరు చేసి చూడలేమని తెలిపింది. ఇటీవల చెన్నైలోని బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

300 ఏళ్ల కిందట రాజుల పాలనలో తమిళనాడులోని అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారని.. ఇప్పుడు వాళ్లే తమిళులుగా చలామణి అవుతున్నారంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆమెపై తమిళనాడులోని పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.