calender_icon.png 23 October, 2024 | 8:52 AM

నత్తనడకన మెట్ల బావి పునరుద్ధరణ

23-09-2024 12:00:00 AM

  1. ఖమ్మం ఖిల్లాలో నిర్మించిన రెడ్డి రాజులు
  2. తాగునీటి అవసరాలు తీర్చిన జాఫర్‌బావి
  3. నేడు ఆదరణకు నోచుకోని వైనం

ఖమ్మం, సెప్టెంబర్ 2౨ (విజయక్రా ంతి): ఖమ్మం ఖిల్లా ప్రాంతంలో క్రీ. శ. 950 సంవత్సరంలో రెడ్డి రాజు లు జాఫర్ మెట్ల బావిని తవ్వించా రు. ముస్లింలు ఎక్కువుగా నివసించే ఖిల్లా లోపల ప్రాంతంలో గోడకు ఆ నుకుని ఈ బావిని నిర్మించారు. రెడ్డి రా జుల కాలంలో మంచినీటి బావిగా ఉండేది. మొదట రాజులు, ఆ తర్వాత  కాలంలో ఖి ల్లా ప్రజలు తాగునీటి కోసం వినియోగించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ తర్వాత ఈ బావిని ఎవరూ పట్టించుకోకపోవడం తో పూర్తిగా పూడుకపోయింది.

పిచ్చిచెట్లు మొలి చి కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. గ తంలో దాదాపు రూ.కోటితో చిన్న చిన్న ప నులు చేసి పునరుద్ధరణకు అధికార యం త్రాంగం చర్యలు తీసుకున్నది. కానీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృ ష్ణారావు జాఫర్ బావిని సందర్శించి, హడావిడి చేసి వెళ్లారు.

ఆ తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన హెరిటేజ్ అనే ప్రైవేట్ నాన్ ఎన్జీవోకు పునరుద్ధరణ పనులు అప్పగించారు. అయినా పనుల్లో మాత్రం పురోగతి కనిపిం చడం లేదు. బావిలోని బురదను తొలగించి లైటింగ్ ఏర్పాటు చేశారు. కానీ పైభాగంలో పునరుద్ధరణ పనులు పూర్తి కాలేదు. అక్కడికి వెళ్లేందుకు రహదారులు ఏర్పాటు చేయాల్సి ఉంది. భారీ వర్షాల వల్ల పనులు ముందుకు సాగని పరిస్థితి ఉంది. 

బావి చుట్టూ ఆక్రమణలే

బావికి ఆనుకుని ఉన్న భూమిని కొందరు ఆక్రమించి ఇళ్లు నిర్మించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ బావికి సంబంధించిన భూమి విలువ పెరగడంతో అక్రమార్కులు కబ్జా చేశారు. బావికి మూడు వైపులా ఆక్రమణలే ఉన్నాయి. ఖిల్లా చెందిన వందల ఎకరాల భూమి కూడా ఆక్రమణలో ఉంది. వాటిల్లో భారీ భవంతులు వెలిశాయి. పర్యాటక శాఖ, నగర పాలక సంస్థ అధికారులు, పాలకులు ఎవరూ పట్టించుకోవడం లేదు. 

62 లక్షలతో పూడిక, లైటింగ్ ఏర్పాటు 

చారిత్ర సంపదైన జాఫర్‌బావి విశిష్టతను భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతో పురావస్తు శాఖ సహకారంతో పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూ పొందించింది. గత కలెక్టర్ గౌతమ్ చొరవ తో సుమారు రూ.62 లక్షలతో  బావిని శుభ్రం చేసి, లైటింగ్ ఏర్పాటు చేశారు. గౌత మ్ బదిలీపై వెళ్లిన తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. పర్యాటక శాఖాధికారులు స్పందించి పనులు వేగవం తం చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

ఏడు భాగాలుగా జాఫర్ బావి

ఖిల్లాలో అంతర్భాంగా ఉన్న ఈ జా ఫర్ బావిని క్రీ.శ. 950 సంవత్సరంలో రెడ్డి రాజుల పాలనలో ఏడు భాగాలుగా నిర్మి ంచారు. పైకి మాత్రం ఒకే బావిలాగా కనిపిస్తుంటుంది. మొత్తం బావిని రాతితోనే నిర్మించారు. బావిలోకి దిగడానికి మెట్ల ఏ ర్పాటు కూడా ఉంది. బావిలో పలమూ డు స్నానాల గదులు కూడా ఉండటం విశేషం. రాణులు, రాజులు దుస్తులు మార్చుకోవడానికి వీలుగా ఈ గదులను నిర్మించారు. తొలి నాళ్లలో ఈ బావిని రెడ్డి రాజులు ఉపయోగించే వా రు. సైనిక కుటుంబాలు కూడా ఖిల్లాలో పల నివసించేవి. ఆ కుటుంబాల నీటి అవసరాలు కూడా జాఫర్ బావి తీర్చింది.  రా జుల కాలం అనంతరం ఈ బావిని ఎవ రూ వాడలేదు.

అయితే 1950లో  లోప ల నివసించే వారు దీనిని వినియోగించా రు. ఈ బావిలోని నీరు తియ్యగా ఉండటంతో పాటు శుద్ధజలంగా భావిస్తుంటా రు. 1969 కాలంలో తీవ్ర వర్షా భా వ పరిస్థితులు తలెత్తినప్పుడు నీరు దొర క్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. ఆ నాడు ఈ జాఫర్ బావి అందరి దా హార్తిని తీర్చింది. రెడ్డిరాజులు ఈ బావితోపా టు ఖమ్మం పట్టణంలో మొత్తం 12 తాగునీటి బావులు తవ్వించినట్లు చరిత్ర చెబు తుంది. అప్పట్లో గాంధీచౌక్‌లో హర్కార బావి, పెవిలియన్ గ్రౌండ్ బావి, బోగంకుంట బావి వంటి 12 బావులు ఉండేవి. 

పునరుద్ధరణకు ప్రతిపాదనలు 

గతంలో మున్సిపల్ నిధులుతో బా విని కొంత పునరుద్ధరించాం. పూర్తి పు నరుద్ధరణకు ప్రతిపాదనలు రూపొందించాం. నిధులు రాగానే పూర్తిస్థాయి లో పనులు నిర్వహిస్తాం. బావిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి అందుబాటు లో తెస్తాం. ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఖిల్లా పైభాగానికి ఎక్కేందుకు రోప్‌వే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

 సుమన్ చక్రవర్తి, 

జిల్లా పర్యాటక శాఖ అధికారి, ఖమ్మం