05-04-2025 12:00:00 AM
54మంది బాదితులకు రూ.3.28కోట్లు అందజేత
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4(విజయక్రాంతి) : ఈ ఏడాది మార్చిలో సైబర్ మోసగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న కేసుల్లో హైదరాబాద్ నగర పోలీసులు మోసగాళ్ల ఖాతాలను ఫ్రొజెన్ చేసి బాదితులకు డబ్బులు రీఫండ్ చేశారు. శుక్రవారం సీపీ సీవీ ఆనంద్ 54మంది బాదితులకు రూ.3.28కోట్లు అందజేశారు. స్టాక్ ట్రేడింగ్ పెట్టుబడి, ఫెడ్‌ఎక్స్ మనీలాండరింగ్, క్యూ ఆర్ కోడ్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, కస్టమర్‌కేర్ ఫ్రాడ్, ఏపీకే ఫైల్ పేరిట మోసపోయిన వారికి రీఫండ్ చేశారు. శుక్రవారం నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఓటీపీ విషయంలో మోస పోయి రూ.47లక్షలను తన ఖాతా నుంచి కోల్పోయాడు.
సైబర్ క్రైం సీఐ కె.మధుసూధన్‌రావు బృందం చొరవతో ఆ మొత్తాన్ని రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. కాగా సీబీఐ, ఆర్‌బీఐ, ఈడీ, కస్టమ్స్, జడ్జిలు, సైబర్‌క్రైమ్ పోలీసులు, నార్కొటిక్స్, ఫెడ్‌ఎక్స్, బీఎస్‌ఎన్‌ఎల్, ట్రాయ్ పేరిట వీడియో కాల్స్ వచ్చినపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. అత్యవసరమైతే 1930 నంబర్‌కు, cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.