18-03-2025 12:16:38 AM
ఆదేశాలు జారీ చేసిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): నిబంధనల మేరకే రద్ద యిన టికెట్లకు రీఫండ్ లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వరదలు, ప్రమాదాలు, సాంకేతిక కారణాలతో రైలు సేవలకు అంతరాయం ఏర్పడినప్పు డు టికెట్ రీఫండ్ ప్రక్రియ కోసం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.
రీఫండ్ విషయంలో నిబంధనలు రూపొందించినట్లు ద.మ. రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ వెల్లడించారు. రైలు రద్దయితే రిజర్వేషన్ టికెట్‌ను మూడు రోజుల్లోపు ఏదైనా రైల్వే స్టేషన్‌లోని పి.ఆర్.ఎస్ కౌంటర్‌లో అప్పగించాలి. దానిని సమర్పించిన తర్వాత అధికారులు పూర్తి టికెట్ డబ్బులను ప్రయాణికులకు చెల్లించనున్నారు.