నెల రోజుల్లో రోడ్ మ్యాప్ రూపొందించనున్న ఉన్నత విద్యామండలి
హైదరాబాద్, నవంబర్ 5 (విజయ క్రాంతి): రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగంలో తీసుకు రావాల్సిన సంస్కరణలు, చేపట్టాల్సిన మార్పులపై తెలం గాణ ఉన్నత విద్యామండలి రోడ్‌మ్యాప్‌ను రూపొందించబోతోంది. ఇందు కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నెల రోజుల్లో ఉన్నత విద్యపై ఒక సమ గ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వాన్నికి సమర్పించనుంది.
స్వల్పకాలిక, ధీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ధేశించుకుని ఈ రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నారు. ఇందుకు త్వరలోనే ఉన్నత విద్యామండలి మేధావులతో సంప్రదింపులు జరపనుంది. ఆన్‌లైన్ క్లాసు లు, ఉద్యోగావకాశాలు లభించే కొత్త కోర్సులు, సిలబస్ తయారీ, పారిశ్రామిక వర్గాలతో అనుసంధానం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు.
నిధులను సైతం సీఎస్‌ఆర్ ద్వారా సమీకరించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దీంతోపాటు వర్సిటీల వారీగా యాక్షన్ ప్లాన్‌ను సైతం రూ పొందించాలని వర్సిటీ కొత్త వీసీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈనేపథ్యం లో వర్సిటీల వారీగా యాక్షన్ ప్లాన్‌ను రూపొందించే పనిలో వీసీలు నిమగ్నమయ్యారు. నెల రోజుల్లో వీటిని రెడీ చేసి సీఎంకు సమర్పించనున్నారు.