calender_icon.png 25 April, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైళ్లలో సంస్కరణలు, పునరావాస చర్యలు చేపట్టాలి

25-04-2025 12:17:10 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ కారాగార ఆలోచనాపరుల వేదిక విజ్ఞప్తి

ముషీరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : జైళ్లలో సంస్కరణలు, పునరా వాసం చేపట్టాలని కేంద్ర, రాస్త్ర ప్రభుత్వాలకు జాతీయ కారాగార ఆలోచనాపరుల వేదిక విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చిసిన మీడియా సమావేశంలో ప్రిజన్ వరల్ ఆర్గనైజేషన్ అద్యక్షులు, తెలంగాణ జైళ్ల మాజీ డైరెక్టర్ జనరల్ ఐపిఎస్(రిటైర్డ్) వి.కె.సింగ్ మాట్లాడుతూ జాతీయ కారాగార ఆలోచనాపరుల వేదిక అయిన ప్రిజన్ వరల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ లో జాతీయ కారాగార మహాసభలు జరిగాయని తెలిపారు.

భారత దేశంలో జైళ్ల సంస్కరణలు, పునరావాసానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిం చేందుకు జైలు, కరెక్షనల్ అధికారులు, ప్రస్తుత, రిటైర్డ్ జైళ్ల శాఖల అధిపతులు, సైకో సోషల్ వర్కర్లు, ఎన్జీవోలు, విద్యావేత్తలను ఏకతాటిపైకి తీసుకురావడానికి 60 మందికి పైగా నిపుణుల మద్దతుతో ఈ మహా సభలు జరిగాయాన్నారు. జైళ్ల శాఖలో వివిధ రాష్ట్రాల్లో 30 శాతం నుంచి 50 శాతం వర కు ఉన్న ఖాళీలు భర్తీ చేయాలన్నారు.

జైళ్లలో సంస్కరణలు, పునరావాసం చేపట్టడానికి కరెక్షనల్ సిబ్బంది కొరతను తీర్చాలన్నారు. జైలు సిబ్బంది, ఖైదీల యొక్క పేలవమైన పని, జీవన పరిస్థితులు మెరుగుపర్చాలని అన్నారు. మానసిక, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించాలని కోరారు. జైళ్లలో మహిళలు, పిల్లలు, బయట కుటుంబ సభ్యుల పరిస్థితులు దాయనీయంగా ఉన్నాయన్నారు.

జైలు సిబ్బందికి విద్య, నైపుణ్య శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు లేకపోవడం వంటి అంశాలపై ఇందులో చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో విశ్రాంత ఐపిఎస్ అధికారి ఎ.నర్సింహా, వినోద లక్ష్మీ, ఎల్‌ఎం.చౌదరి, బేరిక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.