calender_icon.png 10 January, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బడ్డీ’, ‘విరాజి’ టికెట్ ధరల తగ్గింపు

31-07-2024 12:05:00 AM

అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు సామ్ ఆంటోన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బడ్డీ’. అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సినిమాకు కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మాతలు. ఇటీవల కొన్ని సినిమాలకు టికెట్ ధరలు పెంచుతున్న నేపథ్యంలో తమ సినిమాకు మాత్రం తక్కువ ధరలోనే టికెట్ పొందవచ్చంటూ సినీ ప్రియులకు శుభవార్త చెప్పారు. ఇదే విషయాన్ని అల్లు శిరీష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సింగిల్ స్క్రీన్‌లో రూ.99, మల్టీఫ్లెక్స్‌లలో రూ.125గా టికెట్ ధర నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు వరుణ్ సందేశ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘విరాజి’ మూవీ మేకర్స్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ చిత్రాలూ ఆగస్టు 2వ తేదీన విడుదల కానున్నాయి.