హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): విద్యుత్ మీటర్లలో తరుచూ తలెత్తే సాంకేతిక లోపాల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టిన్నట్టు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అలీ అన్నారు. నిరంతరం అధికారులు పర్యవేక్షణ, క్రమం తప్పకుండా లైన్ల నిర్వహణ, పునరుద్దరణ వంటి చర్యలు సకాలంలో చేపడుతున్నందున వినియోగదారులు విద్యుత్ వాడకానికి తగ్గట్టుగా లోడ్ సామర్థ్యం పెంచుకునేలా సంస్థ నుంచి గణనీయమైన కృషి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ... ఎస్పీడీసీఎల్ పరిధిలోని 15 జిల్లాలలో 93,46,952 బిల్డ్ సర్వీసులు ఉన్నాయన్నారు. 2023లో లూస్ వైర్లు, ఓవర్ లోడ్, ఎర్తింగ్ తదితర లోపాలతో 2.04 శాతం మీటర్లు కాలిపోగా.. 2024లో 1.21 శాతానికి తగ్గినట్టు తెలిపారు. ఈ మేరకు 2023తో పోల్చుకుంటే 2024లో మీటర్లలో తలెత్తే సాంకేతిక లోపాలు 40.3 శాతం వరకూ తగ్గాయన్నారు. ఈ లోపాలను వచ్చే ఏడాదికి పూర్తిగా అధిగమిం చి మరింత మెరుగైన సరఫరా అందజేస్తామని తెలిపారు. వినియోగదారులు తమ గృహాల్లో, వాణిజ్య సముదాయాల్లో కనెక్టెడ్ లోడ్‌కు తగ్గట్టు జాయింట్లు లేని వైర్లు, ఎంసీబీలు ఏర్పాటు వంటి భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ వినియోగదారులకు సూచించారు.