calender_icon.png 11 January, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన గ్రామీణ పేదరికం

04-01-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, జనవరి 3: ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా దేశంలో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గిందని శుక్రవారం ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. 2011 25.7 శాతం ఉన్న గ్రామీణ పేదరికం 2024 మార్చినాటికి 4.86 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. పట్టణ పేదరికం కూడా 13.7 శాతం నుంచి 4.09 శాతానికి దిగిందని నివేదిక పేర్కొంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరికం తగ్గడంతో వినియోగ వ్యయాలుపెరుగుతున్నా యని తమ సర్వేలో తేలినట్లు వెల్లడించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం ఉన్న గ్రామీణ పేదరికం 2023 4.86 శాతానికి, 2022 4.6 శాతంగా ఉన్న పట్టణ పేదరికం 4.09 శాతానికి తగ్గినట్లు ఎస్బీఐ రీసెర్చ్ వివరించింది.