బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): హైడ్రా హైరానాతో రెండు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని, రిజిస్ట్రేషన్లు పడిపోయి ఆదాయం తగ్గిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందని చెప్పారు. ‘పనిమంతుడు పందిరేపిస్తే పిల్లి తోక తగిలి కూలింది’ అన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారం ఉందని ఎద్దేవాచేశారు.
తెలంగాణకు గుండెలాంటి హైదరాబాద్‌ను కాపాడుకోవడం చేతకాక,సామాన్యులపై బుల్డోజర్స్ పంపుతున్నారని, ఆయన పాలన చేపట్టిన తరువాత కొత్తగా ఆదాయం సృష్టించుడు లేకుండాపోయిందని, ఉన్నది ఊడగొతున్నారని, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుందన్నారు. ‘మీ నలుగురు సోదరులు నగరంపై ఫోకస్ పెట్టి, అక్కడ కృత్రిమ రియల్ బూమ్ కోసం ఆలోచన చేస్తున్నారు’ అని ఆరోపించారు.