09-04-2025 01:45:00 AM
నివేదికలో బ్రిక్‌వర్క్ రేటింగ్స్ సంస్థ వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 8: ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ బ్రిక్‌వర్క్ రేటింగ్స్ భారతదేశ ఆర్థిక ముఖ చిత్రానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. దేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.61శాతం మేర తగ్గినట్టు ‘ఎకానమీ ఔట్‌లుక్ 2025’ పేరుతో విడుదల చేసిన తన నివేదికలో బ్రిక్‌వర్క్ పేర్కొంది.
ఈ జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.3 శాతంగా నమోదవగా ఫిబ్రవరిలో ఏడు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్నట్టు వివరించింది. అలాగే 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ ఏడు నెలల కనిష్ఠ స్థాయి నుంచి పుంజుకున్నట్టు వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే దేశ జీడీపీ 6.2శాతంగా నమోదైనట్టు తెలిపింది. దేశ ఎకానమీలో సేవల రంగం మరోసారి కీలక పాత్ర పోషించిందని బ్రిక్‌వర్క్ తన నివేదికలో పేర్కొంది. ఇండస్ట్రియల్ సెక్టార్ 4.5, వ్యవసాయ రంగం 5.6 వృద్ధిరేటును నమోదు చేసినట్టు వెల్లడించింది.