హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔష ధ తయారీ సంస్థ రెడ్డీస్ లేబరేటరీస్ నికర లాభాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే 0.90 శాతం తగ్గి రూ.1,392.4 కోట్లుగా నమోదయ్యాయి. అయితే కార్యకలాపాల ద్వారా రాబడి గత ఏడాదితో పోలిస్తే 13.88 శాతం పెరిగి రూ.6,757.9 కోట్లు గా ఉంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో మంచి ఆరంభం చేశామని పలితాలపై వ్యాఖ్యానిస్తూ సంస్థ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ అన్నారు. సంస్థ వృద్ధి, లాభార్జన అన్నీ ప్రధానంగా జనరిక్ వ్యాపారం పైనే ఆధారపడి ఉంటుందని అంటూ, తమ ప్రధాన వ్యాపారాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టిని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.