calender_icon.png 27 January, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ డ్రైవ్‌తో తగ్గిన సమస్యలు

26-01-2025 01:22:55 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): స్పెషల్ డ్రైవ్ కారణంగా రోజూవారీగా వచ్చే ఫిర్యాదులు 30 శాతం తగ్గాయని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. శనివారం జలమండలి కార్యాలయంలో ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్‌మిట్టల్ అధికారులతో సమావేశమయ్యారు. ఒకవైపు రోజూవారీ ఫిర్యాదులను పరిష్కరించుకుంటూనే..స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. ఈ డ్రైవ్ సత్ఫలితాలిస్తున్నందున మరో ౯౦ రోజలు పొడిగించినట్లు తెలిపారు.