calender_icon.png 31 January, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన ఎంపీటీసీ స్థానాలు

31-01-2025 12:53:22 AM

  • చేవెళ్లలో 12, మొయినాబాద్ 9 స్థానాలతో ముసాయిదా జాబితా

ఆలూరులో రెండు స్థానాలు యథాతథం కొత్తగా కమ్మెటకు ఎంపీటీసీ

చేవెళ్ల, జనవరి 30: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మొయినాబాద్ మండలాలు ఇటీవల మున్సిపాలిటీలుగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీటీసీల స్థానాలు దాదాపు మూడో వంతు తగ్గాయి.  మున్సిపాలిటీల్లో విలీన గ్రామాలు పోను.. 

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం - 2018లోని సెక్షన్ 144 ప్రకారం ఎంపీటీసీల పునర్ వ్యవస్థీకరణ చేపట్టిన ప్రభుత్వం గురువారం రాత్రి ముసాయిదా జాబితా విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇదివరకే ఉన్నవి, కొత్తవి కలిపి చేవెళ్ల మండలంలో 12, మొయినాబాద్ 9 స్థానాలు ఏర్పాట్లు చేయనున్నట్లు అందులో పేర్కొంది.   

 చేవెళ్లలో 17 నుంచి 12కు..

చేవెళ్ల మండలంలో మొత్తం 37 గ్రామాల(అనుబంధ గ్రామాలు కలిపి)కు.. 17 ఎంపీటీసీలు స్థానాలు ఉండేవి. ఇందులో నుంచి 8 గ్రామ పంచాయతీల (చేవెళ్ల, ఊరెళ్ల, దామరిగిద్ద, మల్కాపూర్, ఇబ్రహీపల్లి, కేసారం, దేవుని ఎర్రవల్లి, రామన్నగూడ)తో ఇటీవల మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. మిగితా 29 గ్రామాలకు గాను 12 ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేయనున్నట్లు పంచాయతీ అధికారులు ముసాయిదా రిలీజ్ చేశారు.

ఈ మార్పుల్లో 12 ప్రస్తుతం కొనసాగుతున్నవే కాగా...  కమ్మెటను మాత్రం కొత్తగా ప్రతిపా దించారు.  ఆలూరులో రెండు స్థానాలు అలాగే ఉంచారు. పాతవాటిలో కొన్ని అటుఇటుగా మారాయి. కుమ్మెర గ్రామంలో ఇదివరకు మల్కాపూర్ ఎంపీటీసీ స్థానంలో ఉండేది.. మల్కాపూర్ మున్సిపాలిటీలో చేరడంతో ఆ గ్రామాన్ని పక్కనే ఉన్న ముడిమ్యాలలో కలిపారు. 2011 జనగణన ప్రకారం అలోర్-2లో 4,556, అంతారం 4,528, ఖానాపూర్ 4,332 ఎక్కువ జనాభా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు

మొయినాబాద్ లో 17 నుంచి 9 స్థానాలకు..

మొయినాబాద్ మండలంలో ఇదివరకు 28 గ్రామాల( అనుబంధ గ్రామాలు కలిపి)కు.. 17 ఎంపీటీసీలు ఉండేవారు.  ఇందులో నుంచి  8 గ్రామ పంచాయతీలు (మొయినాబాద్, హిమాయత్‌నగర్, ఎన్కెపల్లి, చిల్కూరు, ముర్తుజాగూడ, పెద్దమంగళారం,  సురంగల్, అజీజ్ నగర్) మున్సిపాలిటీలో విలీనం  చేశారు. 

మిగిలిన మిగిలిన 20 గ్రామ పంచాయతీలతో 9 ఎంపీటీసీలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎంపీడీవో సంద్య కార్యాలయ నోటీసు బోర్డులో జాబితాను అంటించారు. సంబంధిత గ్రామాల ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వవచ్చని ఆమె తెలిపారు.