calender_icon.png 27 December, 2024 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన ఎల్‌ఐసీ లాభం

09-11-2024 01:40:13 AM

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) నికరలాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 4 శాతం క్షీణించి రూ. 7,621 కోట్లకు తగ్గింది. నిరుడు ఇదేకాలంలో సంస్థ రూ.7,925 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. ఎల్‌ఐసీ నికర ప్రీమియం ఆదాయం రూ. 1,07,397 కోట్ల నుంచి రూ. 1,19,901 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 2,01,587 కోట్ల నుంచి రూ. 2,29,620 కోట్లకు పెరిగింది. సాల్వెన్సీ రేషియో 190 శాతం నుంచి 198 శాతానికి చేరిందని ఎల్‌ఐసీ తెలిపింది.