calender_icon.png 18 November, 2024 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన హ్యుందాయ్ మోటార్ లాభం

13-11-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఇటీవల స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయిన ఆటోమొబైల్ దిగ్గ జం హ్యుందాయ్ మోటర్ ఇండియా కన్సాలిడేటెడ్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2లో 16 శాతం క్షీణించి రూ. 1,375 కోట్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదేకాలంలో రూ.1,628 కోట్ల నికరలాభాన్ని సంపాదించింది. ఈ క్యూ2లో హ్యుందాయ్ మోటార్ ఆదాయం కూడా రూ. 18,660 కోట్ల నుంచి రూ. 17,260 కోట్లకు తగ్గింది.