calender_icon.png 28 September, 2024 | 8:54 AM

తగ్గిన ఇండ్ల అమ్మకాలు

21-09-2024 12:00:00 AM

  1. హైదరాబాద్‌లో 42 శాతం తగ్గుదల 
  2. ప్రాప్‌ఈక్విటీ రిపోర్ట్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 18 శాతం తగ్గినట్టు రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది. శుక్రవారం ఈ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 9 ప్రధాన నగరాల్లో ఇండ్ల విక్రయాలు, 04,393 యూనిట్లకు పరిమితమ య్యాయి. నిరుడు ఇదేకాలంలో 1,26,848 యూనిట్ల సేల్స్ జరిగింది. 9 ప్రధాన నగరాల్లో ఢిల్లీ ఎన్సీఆర్, నవీ ముంబైల్లో మాత్రమే అమ్మకాలు వృద్ధిచెందగా, మిగిలిన 7 నగరాల్లో క్షీణించాయి. అన్నింటికంటే అధికంగా హైదరాబాద్‌లో 42 శాతం తగ్గాయి. కేవలం గత ఏడాది హయ్యర్ బేస్ కారణంగా ఈ ఏడాది ఇండ్ల అమ్మకాలు తక్కువ శాతం నమోదయ్యాయని, ఇందుకు ప్రతికూల పరిస్థితులు కారణం కాదని ప్రాప్‌ఈక్విటీ సీఈవో సమీర్ జాసుజా తెలిపారు.

జూలై-సెప్టెంబర్‌లో ఇండ్ల అమ్మకాలు

నగరం యూనిట్లు వృద్ధి/క్షీణత

(శాతం)

2024 2023

హైదరాబాద్ 12,082 20,658 -42

బెంగళూరు 13,355 17,978 -26

చెన్నై 4,634 5,628 -18

కోల్‌కతా 3,590 4,634 -23

ముంబై 10,966 13,167 -17

నవీ ముంబై 7,737 7,416 +4

ముంబై ఎంఎంఆర్ 20,460 22,802 -10

ఢిల్లీ ఎన్సీఆర్ 10,223 8,411 +22

పూనె 21,306 26,154 -19