calender_icon.png 23 October, 2024 | 2:17 AM

తగ్గిన ఇండ్ల అమ్మకాలు

12-07-2024 12:05:00 AM

  1. లోక్‌సభ ఎన్నికలు కారణం 
  2. ప్రాప్‌టైగర్ డేటా

న్యూఢిల్లీ, జూలై 11: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు 6 శాతం తగ్గాయని ప్రాపర్టీ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్‌టైగర్ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిల్డర్లు, ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో క్యూ1లో అమ్మకాలు తగ్గాయన్నది. ప్రాప్‌టైగర్ గురువారం విడుదల చేసిన త్రైమాసిక గణాంకాల ప్రకారం ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమా సికంతో పోలిస్తే 8 ప్రధాన నగరాల్లో హౌసిం గ్ అమ్మకాలు  6 శాతం తగ్గి 1,13,768 యూనిట్ల వద్ద నిలిచాయి. 2024 జనవరి-మార్చిలో 1,20,642 యూనిట్లు అమ్ముడ య్యాయి. అయితే 2023 ఏప్రిల్-జూన్‌లో జరిగిన 80,245 యూనిట్ల అమ్మకాలకంటే తాజా క్యూ1లో 42 శాతం వృద్ధిచెందాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై వినియోగదారుల సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ, ఎన్నికల కారణంగా ఏప్రిల్-జూన్‌లో ఇండ్ల కు డిమాండ్ స్వల్పంగా తగ్గిందని ప్రాప్‌టైగర్ బిజినెస్ హెడ్ వికాస్ వాధ్వాన్ చెప్పారు. 

నగరాలవారీగా అమ్మకాలు

ప్రాప్‌టైగర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాలు ఏప్రిల్-జూన్ మధ్యలో 14 శాతం తగ్గి 12,296 యూనిట్లకు చేరాయి. ఈ ఏడాది జనవరి-మార్చిలో 14,298 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ముంబై మెట్రో పాలిటిన్ రీజియన్‌లో అమ్మకాలు 8 శాతం క్షీణించి 41,594 యూనిట్ల నుంచి 38,266 యూనిట్లకు తగ్గాయి. పూణేలో అమ్మకాలు 5 శాతం తగ్గి 23,112 యూనిట్ల నుంచి 21,925 యూనిట్లుగా నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో 26 శాతం క్షీణించి 12,915 యూనిట్ల నుంచి 9,500 యూనిట్లకు చేరా యి. బెంగళూరులో మాత్రం అమ్మకాలు 30 శాతం వృద్ధిచెంది 10,381 యూనిట్ల నుంచి 13,495 యూనిట్లకు పెరిగాయి. చెన్నైలో అమ్మకాలు 10 శాతం క్షీణించి 4,427 యూనిట్ల నుంచి 3,984 యూనిట్లకు తగ్గాయి. ఢిల్లీ ఎన్సీఆర్‌లో విక్రయాలు 10 శాతం వృద్ధిచెంది 10,058 యూనిట్ల నుంచి 11,065 యూనిట్లకు పెరిగాయి. కోల్‌కతాలో అమ్మకాలు 3,857 యూనిట్ల నుంచి 3,237 యూనిట్లకు తగ్గాయి.