రూ.95 వేల దిగువకు వెండి
న్యూఢిల్లీ: పండగలు, వివాహాది శుభకార్యాల నేపథ్యంలో ఇటీవల వరుసగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధర లు కాస్త నెమ్మదించాయి.సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1300 మేర తగ్గి రూ.81,100కు చేరినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.
99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధ ర గురువారం గరిష్ఠంగా రూ.82,400 మేర పలికిన సంగతి తెలిసిందే.ఇటీవలి కాలంలో లక్ష రూపాయల మార్కు దాటిన కిలో వెండి ధర సైతం దిగొచ్చింది. గురువారం రూ.99,500 పలకగా..ఢిల్లీలో సోమవారం దీని ధర రూ.4,600 తగ్గి రూ.94,900కు చేరింది.
బంగారం వర్తకులు, రిటైలర్ల నుంచి ఆశించిన మేర డిమాండ్ లేకపోవడంతో బంగారం, వెండి ధరల తగ్గుముఖం పట్టడానికి కారణమని అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు 2740 డాలర్ల వద్ద కొసాగుతుండగా.. వెండి ఔన్సు 32.80 డాలర్లుగా ఉంది.