calender_icon.png 11 October, 2024 | 6:00 PM

తగ్గిన బంగారం, వెండి ధరలు

01-10-2024 12:00:00 AM

హైదరాబాద్: రూ.70 వేలుదాటేసిన తులం బంగారం ధర మెల్లగా తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా చుక్కలుతాకిన పసిడి.. రెండూ రోజు స్వల్పంగా తగ్గింది. దీంతో ధరల్లో మార్పు లు జరిగాయి.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా సోమవారం పసిడి ధరలు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 160 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది.

దీంతో తులం 22 క్యారెట్ల బంగా రం రేటు రూ. 70,800 వద్ద, 24 క్యారెట్ల పసిడి ధర రూ.77,240 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా గోల్ రేటు తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,800, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,240గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 150, రూ. 160 తగ్గినట్లు స్పష్టమవుతోంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 70,950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.77,390 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరకూడా స్వల్పంగా తగ్గింది. నిన్న రూ. 1,01,000 వద్ద ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 100 తగ్గింది. దీంతో సిల్వర్ రేటు రూ. 1,09,000 వద్దకు చేరింది. ఇదే ధరలు దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఉండే అవకాశం ఉంటుంది.