calender_icon.png 4 April, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యంతో తగ్గిన ఆర్థిక భారం

04-04-2025 12:23:38 AM

మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 3 (విజయక్రాం తి): నిరుపేదల ఆర్థిక భారాన్ని తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచ్చాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

గురువారం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని గగ్గలపల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అన్నిటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ పథక ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి  పేర్కొన్నారు. బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే అధికారులను హేచ్చరించారు. వారితోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు తదితరులు ఉన్నారు.