calender_icon.png 18 January, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగ్గిన అబ్కారీ ఆదాయం!

18-01-2025 01:43:49 AM

  1. సంక్రాంతి సీజన్‌లో లిక్కర్ ఆదాయం రూ. 1,127 కోట్లు 
  2. గతేడాది జనవరి 1 నుంచి 14 వరకు రూ. 1,247 కోట్లు 
  3. ఈ ఏడాది రూ. 120 కోట్లు తగ్గుదల

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి) : సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ విక్రయంలో ఆశించిన మేర ఆదాయం తీసుకురాలేదు. మద్యం విక్రయం భారీగా ఉంటుందని  ఆశించినప్పటికీ.. గత ఏడాదికంటే ఇప్పుడు రూ. 120 కోట్ల తక్కువ ఆదా యం వచ్చింది.

ప్రతి ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతుంటాయని, ఈ ఏడాది కూడా గతంకంటే ఎక్కువగానే ఉంటాయని అబ్కారీ శాఖ అంచనా వేసినా అమ్మకాలు ఊపందుకోలేదు. గత ఏడాది జనవరి 1 నుంచి 14 వరకు మద్యం విక్రయాల ద్వారా రాష్ట ప్రభుత్వానికి రూ. 1,247 కోట్ల ఆదాయం వస్తే.. ఈ ఏడాది జనవరి 1 నుంచి 14 వరకు రూ. 1,127 కోట్ల ఆదాయం వచ్చినట్లు అబ్కారీశాఖ అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ  జనవరి నెలకు ముందు.. డిసెంబర్ నెలలో రూ. 3,800 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా సం బంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది అక్టోబర్ నెలలో రూ. 3,840 కోట్ల ఆదాయం వచ్చిం ది. అదే నెలలో దసరా పండుగ రో జున రూ. 402 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి.

అయితే ఈ నెలలో పండుగ సీజన్‌లో లిక్కర్ ఆదాయం తగ్గడానికి.. హైదరాబాద్ నుంచి ప్ర జలు ఎక్కువగా సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లడం ఒక కార ణమని అబ్కారీశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది సంక్రాంతికి సీమాంధ్ర ప్రజలకు ఏపీకి వెళ్లా రని, అప్పటికంటే  ఇప్పుడు ఎక్కువగా వెళ్లారని చెబుతున్నారు.